Published : 13 Aug 2022 03:43 IST

ఐదు తరాలు చూసిన అవ్వకు అభినందన

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఐదు తరాల 50 మంది వారసులు శతాధిక వృద్ధురాలిని సత్కరించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలం ఏటిగడ్డిండ్లు గ్రామానికి చెందిన గంటలమ్మకు 105  ఏళ్లు నిండాయి. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. వీరి కుమారులు, కుమార్తెలు, మనమళ్లు, మనమరాళ్లు.. ఇలా 5 తరాల వారసులను ఆమె చూసింది. గంటలమ్మ ఇప్పటికీ తన పనులు తాను చేసుకుంటోంది. ఇప్పటి వరకూ ఎలాంటి అనారోగ్య సమస్య వేధించలేదని, సూది మందు వేయించుకోలేదని చెబుతున్నారు. రాగి సంగటి, ఆకుకూరలు, జొన్న, సజ్జ, సామలతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడంతో ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. శుక్రవారం మురారిపల్లెలోని శ్రీ ఓబులేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసుకున్న సందర్భంగా గంటలమ్మ వారసులంతా కలిసి ఆమెను సన్మానించారు. అనంతరం అన్నదానం చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని