Published : 13 Aug 2022 03:43 IST

న్యాయస్థానం ఆదేశించినా స్పందనలేదు

ఠాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు

హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఠాణాలు, కారాగారాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదంటూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ వి.సుజాతలతో కూడిన ధర్మాసనం శుక్రవారం దీనిపై విచారణ జరిపింది. హోంశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, జైళ్లశాఖ డీజీ మహ్మద్‌ హసన్‌ రెజాకు కౌంటరు దాఖలు చేయాలని నోటీసులు జారీచేసింది. 2019 జులై 15న ఈ అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం.. రాష్ట్రంలోని అన్ని ఠాణాలు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశించినా అధికారుల్లో స్పందన లేదంటూ హైకోర్టులో తాజాగా కోర్టుధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని