ఆస్తి పన్ను బకాయిదారులపై ప్రి లిటిగేషన్‌ కేసు

ఆస్తి, నీటి పన్ను రాబట్టేందుకు అనంతపురంలో 3,390 మందిపై అధికారులు ప్రి లిటిగేషన్‌ కేసు పెట్టారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ పేరుతో సంబంధిత సచివాలయాల

Published : 13 Aug 2022 03:39 IST

అనంతపురంలో 3,390 మందికి తాఖీదులు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: ఆస్తి, నీటి పన్ను రాబట్టేందుకు అనంతపురంలో 3,390 మందిపై అధికారులు ప్రి లిటిగేషన్‌ కేసు పెట్టారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ పేరుతో సంబంధిత సచివాలయాల సిబ్బంది గత పది రోజులుగా ప్రజలకు తాఖీదులు అందించారు. వీరందరూ శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు పన్ను చెల్లించకుండా ఉండటంతో పాటు రూ.10వేలకు పైగా బకాయి ఉన్న అంశాలను నగరపాలక అధికారులు పరిగణనలోకి తీసుకున్నారు. కోర్టు ఆవరణలోనే ప్రత్యేక కౌంటర్లు ఉంటాయని, అక్కడే పన్ను చెల్లించినా కేసు రాజీమార్గంలో పూర్తవుతుందని అదనపు కమిషనరు రమణారెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని