రఘురామ ఎఫ్‌ఐఆర్‌ రద్దు పిటిషన్‌ కొట్టివేత

తన రక్షణ సిబ్బంది, కుమారుడిపై గచ్చిబౌలి పోలీసులు పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విధి

Published : 13 Aug 2022 03:39 IST

ఈనాడు, దిల్లీ: తన రక్షణ సిబ్బంది, కుమారుడిపై గచ్చిబౌలి పోలీసులు పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విధి నిర్వహణలో తనపై ఎంపీ రఘురామకృష్ణరాజుకు రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది, ఆయన కుమారుడు దాడి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం విదితమే. ఆ ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ వేయగా తెలంగాణ హైకోర్టు దానిని కొట్టివేసింది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అదనపు సమాచారం అందజేసేందుకు తమకు కొంత సమయం కావాలని విన్నవించారు.  కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలోనే ఉన్నందున మీ వద్ద ఏమైనా అదనపు సమాచారం ఉంటే దర్యాప్తు అధికారికి అందజేయాలని సూచించిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని