ఆ బాధ మరెవరికీ రావొద్దని!

రహదారి మధ్యలో ఉన్న గుంతను పూడుస్తున్నది జీవీఎంసీ సిబ్బంది కాదు. దాని వల్ల నష్టపోయిన కుటుంబ సభ్యులు. ఆ గుంత వల్ల కుటుంబ సభ్యుడిని కోల్పోయి.. ఆ కష్టం

Updated : 13 Aug 2022 13:58 IST

గుంతను పూడ్చిన బాధిత కుటుంబీకులు

ఈనాడు, విశాఖపట్నం: రహదారి మధ్యలో ఉన్న గుంతను పూడుస్తున్నది జీవీఎంసీ సిబ్బంది కాదు. దాని వల్ల నష్టపోయిన కుటుంబ సభ్యులు. ఆ గుంత వల్ల కుటుంబ సభ్యుడిని కోల్పోయి.. ఆ కష్టం మరెవరికీ రావద్దనే ఆలోచనతో కన్నీటిని దిగమింగుకొని రోడ్డు గుంతను పూడుస్తూ కనిపించారు. విశాఖపట్నానికి చెందిన రవ్వా సుబ్బారావు ఈ నెల 4న ద్విచక్రవాహనంపై విశాఖపట్నం డీఆర్‌ఎం కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్తూ రహదారి మధ్యలో ఉన్న గుంత వల్ల కిందపడిపోయాడు. ఆ సమయంలో సుబ్బారావు తలకు తీవ్ర గాయమైంది. రెండు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది ఈనెల 6న మృతి చెందారు. ఈ ప్రమాదం మరిచిపోక ముందే అదే గుంత వల్ల మరో యువకుడూ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న సుబ్బారావు అల్లుడు వెంకటరావు చలించిపోయారు. అయినవారు దూరమైన బాధలో ఉన్నా.. మానవత్వంతో స్పందించారు. మరెవరికీ ఆపద రాకూడదని తన సొంత ఖర్చుతో సిమెంటు, ఇసుక, కంకర తెచ్చి స్వయంగా గుంతను పూడ్చి వెళ్లారు. అధికారులు చేయాల్సిన పనిని ఇలా ప్రజలే చేసుకోవాల్సి రావడమేంటని అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని