నంద్యాల రెండో పట్టణ సీఐ సస్పెన్షన్‌

నంద్యాల రెండో పట్టణ సీఐ ఎన్‌.వి.రమణను సస్పెండ్‌ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. నంద్యాల ఒకటో పట్టణ సీఐ ఆదినారాయణరెడ్డి,

Published : 13 Aug 2022 03:39 IST

వీఆర్‌కు మరో సీఐ, ఏఎస్‌ఐ విధుల్లో నిర్లక్ష్యమే కారణం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల రెండో పట్టణ సీఐ ఎన్‌.వి.రమణను సస్పెండ్‌ చేస్తూ కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. నంద్యాల ఒకటో పట్టణ సీఐ ఆదినారాయణరెడ్డి, ఏఎస్‌ఐ కృష్ణారెడ్డిని వీఆర్‌కు పంపుతూ డీఐజీ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ఇటీవల నంద్యాల రెండో పట్టణ కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌ రౌడీషీటర్ల చేతిలో దారుణంగా హత్యకు గురైన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా వీరు ముగ్గురూ విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న అభియోగంతో వేటు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని