అన్ని పాఠశాలలకూ ఇంటర్నెట్‌

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అత్యుత్తమ బోధనకు ఇంటర్నెట్‌ సౌకర్యం దోహదపడుతుందన్నారు.

Published : 13 Aug 2022 03:39 IST

బడుల నిర్వహణకు ప్రత్యేక అధికారి

విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. అత్యుత్తమ బోధనకు ఇంటర్నెట్‌ సౌకర్యం దోహదపడుతుందన్నారు. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలని, పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు చేసేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ‘నాడు-నేడు పనులు పూర్తి చేసిన పాఠశాలల్లో నిర్వహణ బాగుండాలి. దీనిపై వచ్చే సమీక్ష నాటికి దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలి. దీని కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలి. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించేందుకు టెండర్లు ఖరారు చేసి, వెంటనే ఆర్డర్‌ ఇవ్వాలి. ప్రతి తరగతి గదిలోనూ స్మార్ట్‌ టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలి. పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌ను అందరికీ అందుబాటులో పెట్టాలి. పీడీఎఫ్‌ల రూపంలో అందుబాటులో ఉంచితే పాఠ్యపుస్తకాలు అందరికీ లభిస్తాయి. ప్రైవేటు పాఠశాలలు పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని అందించండి’ అని అధికారులను ఆదేశించారు.

బాలికల భద్రతపై అవగాహన కల్పించాలి
‘బాలికల రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలి. గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా విద్యార్థినులను కలిసి అవగాహన కల్పించాలి. విద్యార్థినుల సమస్యలపై ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్‌ కోసం నియమించాలి. వచ్చే ఏడాది విద్యా కానుకకు సంబంధించి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలి. ఏప్రిల్‌ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధం చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts