‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ విధానానికి ఎన్నారైల చేయూత

రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ విధానానికి చేయూతనిచ్చేందుకు పలువురు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) సంసిద్ధత వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రభుత్వ వైద్య

Published : 13 Aug 2022 05:00 IST

రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహాదారు వాసుదేవరెడ్డి

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ‘ఫ్యామిలీ ఫిజీషియన్‌’ విధానానికి చేయూతనిచ్చేందుకు పలువురు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) సంసిద్ధత వ్యక్తం చేశారని రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహాదారు డాక్టర్‌ వాసుదేవరెడ్డి తెలిపారు. ఆయన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ విత్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (ఆఫి) గౌరవ అధ్యక్షుడు డాక్టర్‌ రవి కొల్లి, ప్రముఖ నియోనేటాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రకాశ్‌, ట్రెయిన్‌ అండ్‌ హెల్ప్‌ బేబీస్‌ డైరెక్టర్‌ సింగం హరిబాబుతో కలిసి మంగళగిరిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిని కలిశారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసూతి, శిశు మరణాలకు గల కారణాలపై పరిశోధన ద్వారా గుర్తించిన అంశాల ఆధారంగా తిరుపతి, గుంటూరు వైద్య కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డాక్టర్‌ రవి కొల్లి మాట్లాడుతూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు చేపట్టిన పథకాలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. మాతాశిశు సంరక్షణకు అందించే చికిత్సలో ఆధునిక పద్ధతులు అవలంబించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. టెక్సాస్‌లో ట్రెయిన్‌ అండ్‌ హెల్ప్‌ బేబీస్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మాతాశిశు సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నియోనేటాలజిస్ట్‌ ప్రకాశ్‌ కబ్బూర్‌ తెలిపారు. రాష్ట్రంలో తమ వంతు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికాలోని డల్లాస్‌లో గత పదేళ్లుగా ట్రైన్‌ అండ్‌ హెల్ప్‌ బేబీస్‌ సంస్థను నిర్వహిస్తున్నామని డాక్టర్‌ సింగం హరిబాబు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలతోపాటు తెలంగాణలోని నల్గొండలో కూడా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని