సంక్షేమ వసతి గృహాల్లో నాడు-నేడు పనులకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో నాడు-నేడు పనుల కార్యాచరణ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని

Published : 13 Aug 2022 05:00 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సంక్షేమ వసతి గృహాలు, గురుకుల విద్యా సంస్థల్లో నాడు-నేడు పనుల కార్యాచరణ ప్రణాళిక తయారు, అమలు, పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీకి బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా కన్వీనర్‌గా సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు, మరో నలుగురు సభ్యులు ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ వసతి గృహాల్లో ప్రస్తుతం అమలవుతున్న డైట్‌ ఛార్జీలు, మంచి ఆహారాన్ని అందించేందుకు తీసుకురావాల్సిన మార్పులను ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించాలి. అంతేకాకుండా అద్దె భవనాల్లో ఉన్న వసతి గృహాలకు అవసరమైన సదుపాయాల కల్పన, సిబ్బంది కొరతపై దృష్టిసారించాలి. వసతి గృహాలు, గురుకులాల్లో చేపట్టాల్సిన మౌలిక వసతుల ఉన్నతీకరణ, విద్యార్థులకు అందించాల్సిన సామగ్రిపై ప్రభుత్వానికి నివేదించాలి. వీటిపై చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను 2 వారాల్లో సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు నిర్దేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని