పీజీ వైద్య ప్రవేశాలకు ప్రకటన విడుదల

పీజీ వైద్య విద్యలో 2022-23 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం

Published : 13 Aug 2022 05:03 IST

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: పీజీ వైద్య విద్యలో 2022-23 విద్యా సంవత్సరానికి కన్వీనర్‌ కోటా సీట్ల ప్రవేశానికి సంబంధించి విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నీట్‌ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు శనివారం (13న) ఉదయం 10 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను జత చేసి పంపాల్సి ఉంటుంది. నీట్‌ పీజీలో జనరల్‌ కేటగిరీలో 275 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు 245 మార్కులు, అన్‌ రిజర్వుడు/దివ్యాంగుల కేటగిరీకి 260 మార్కులు కటీఫ్‌గా నిర్ణయించారు. ఎంబీబీఎస్‌ అభ్యర్థులు ఈ ఏడాది మే 31వ తేదీలోగా, బీడీఎస్‌ పూర్తి చేసిన విద్యార్థులు మార్చి 31లోగా తప్పనిసరిగా తమ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వం విడుదల చేసిన 150 జీవో ప్రకారం సర్వీస్‌ కేటగిరీ అభ్యర్థులు రెండేళ్లు గిరిజన ప్రాంతాలు, మూడేళ్లు గ్రామీణ ప్రాంతాలు, ఆరేళ్లు రెగ్యులర్‌ ప్రాంతాల్లో సర్వీసులో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.7,080, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.5,900 ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించాలి. దరఖాస్తు ఫారాలు, ఇతర వివరాలఃi విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ ntruhs.ap.nic.inలో పొందుపర్చారు. సాంకేతికపరంగా సమస్యలు ఉంటే 7416563063, 7416253073, మార్గనిర్దేశకాల్లో సందేహాలు ఉంటే 8978780501 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని