శ్రీశైలానికి పెరిగిన వరద

ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శుక్రవారం 4,27,718 క్యూసెక్కుల మేర

Published : 13 Aug 2022 05:10 IST

సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శుక్రవారం 4,27,718 క్యూసెక్కుల మేర వచ్చినట్లు అధికారులు తెలిపారు. జలాశయం పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 3,77,650, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 58,609 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగులు, నీటినిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా 213.4011 టీఎంసీలుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు