ఉగ్ర గోదావరి ఉరకలు

గోదావరిపై ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం 15 అడుగులు ఉండగా, సముద్రంలోకి 14,76,919

Published : 13 Aug 2022 05:10 IST

ఈనాడు, అమలాపురం: గోదావరిపై ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు నీటిమట్టం 15 అడుగులు ఉండగా, సముద్రంలోకి 14,76,919 క్యూసెక్కులు, కాలువలకు 9వేల క్యూసెక్కులు వదిలారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదీపాయల్లో ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల కాజ్‌వేలు మునిగి రాకపోకలకు ఆటంకమేర్పడింది. పోలవరం స్పిల్‌వే వద్ద శుక్రవారం సాయంత్రానికి 34.15 మీటర్లకు నీటిమట్టం చేరింది. 48గేట్ల నుంచి 12.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts