విద్యా విధానంలో మార్పులపై విమర్శలు తగదు: మంత్రి బొత్స

ప్రపంచ దేశాలతో రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా ప్రస్తుత విద్యావిధానంలో తెస్తున్న మార్పులపై దుమ్మెత్తిపోయడం తగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

Published : 14 Aug 2022 02:21 IST

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: ప్రపంచ దేశాలతో రాష్ట్ర విద్యార్థులు పోటీపడేలా ప్రస్తుత విద్యావిధానంలో తెస్తున్న మార్పులపై దుమ్మెత్తిపోయడం తగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంగ్లిషు విద్య వద్దా? మూడో తరగతినుంచే సబ్జెక్టు టీచరు వ్యవస్థ రావొద్దా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం విజయనగరంలోని బాబామెట్టలో ప్రగతి పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను చదువుకున్నప్పటినుంచి.. గతేడాది వరకు 1 నుంచి 5వ తరగతి వరకు ఒకరే టీచరు బోధించేవారని, ఇప్పుడు ఐదుగురు సబ్జెక్టు టీచర్లు బోధించేలా మార్పులు చేశామని మంత్రి వివరించారు. ఒకటో తరగతినుంచే ఆంగ్ల బోధనను పాఠశాలల్లో ప్రవేశపెట్టి విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేశామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని