Published : 14 Aug 2022 03:38 IST

మృత్యు గుంతపై బీటీ లేయర్‌

విశాఖ తెలుగుతల్లి పైవంతెన వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంత కారణంగా రవ్వా సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందడంతో మరెవరికీ అటువంటి ఆపద రాకూడదని భావించిన ఆయన కుటుంబీకులు శుక్రవారం దాన్ని కాంక్రీట్‌తో పూడ్చారు. దీనిపై శనివారం ‘ఈనాడు’లో ‘ఆ బాధ మరెవరికీ రావొద్దని’ శీర్షికతో చిత్ర వార్త ప్రచురితమైంది. దీనికి స్పందించిన జీవీఎంసీ అధికారులు కాంక్రీటుపై బీటీ లేయర్‌ వేసి గుంతను పూర్తిగా పూడ్చారు. ప్రమాదాలు జరగక ముందే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు వాహనచోదకులు వ్యాఖ్యానించారు.

- ఈనాడు, విశాఖపట్నం

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని