గాయని పి.సుశీలకు ఘంటసాల పురస్కారం

‘కన్నడ-తెలుగు ప్రజలు తోబుట్టువులు. 12 భాషల్లో పాటలు పాడా. ప్రేక్షకుల అభిమానమే నాకు జీవం పోసింది’ అని ప్రముఖ గాయకురాలు పి.సుశీల అన్నారు.

Published : 14 Aug 2022 03:24 IST

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే: ‘కన్నడ-తెలుగు ప్రజలు తోబుట్టువులు. 12 భాషల్లో పాటలు పాడా. ప్రేక్షకుల అభిమానమే నాకు జీవం పోసింది’ అని ప్రముఖ గాయకురాలు పి.సుశీల అన్నారు. బెంగళూరులోని శ్రీకృష్ణదేవరాయ కళామందిరంలో తెలుగు విజ్ఞాన సమితి శనివారం ఆమెకు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పురస్కారాల కోసం నేను ఏనాడూ పాడలేదు. ఘంటసాల నా గురువు.. దైవం. ఆయన ఆశీస్సులతోనే ఈ స్థాయికి వచ్చా’ అని తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ చంద్రశేఖర్‌ కంబార మాట్లాడుతూ.. ఉత్తరాదిన లతా మంగేష్కర్‌.. దక్షిణాదిన సుశీల సంగీత సామ్రాజ్యాలు స్థాపించారని శ్లాఘించారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్‌ ఎ.రాధాకృష్ణరాజు, ఉపాధ్యక్షుడు గంగరాజు, ప్రధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భాస్కరుని సత్య జగదీశ్‌ రాసిన మన ‘ఘంటసాల కథ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని