ఆలయాలపై ప్రభుత్వ పెత్తనం

హిందువులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోందని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పేర్కొన్నారు. ఆలయాలను

Published : 14 Aug 2022 03:24 IST

హిందువులు అప్రమత్తంగా లేకపోవడమే కారణం

తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: హిందువులు అప్రమత్తంగా లేకపోవడం వల్లే దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోందని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పేర్కొన్నారు. ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాలపై ఉందని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలో అన్యమత ప్రచారం ఎక్కువైందని, మత మార్పిడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో దేవాలయ, అర్చక వ్యవస్థలను పటిష్టం చేసే ఉద్దేశంతో గుంటూరు జిల్లా సీతానగరం కరకట్ట మీద ఉన్న గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమంలో శ్రీభారతీ దేవాలయ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ.. ‘‘హిందువులు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలయాలపై దేవాదాయశాఖ లేని పెత్తనాన్ని చెలాయిస్తోంది. వేల ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి’’ అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బులుసు శివశంకరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన ఆలయ భూములను ఈనాంఫేర్‌ రిజిస్టర్‌, రీసెటిల్‌మెంట్‌ సర్వేల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. సమరసత సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి విష్ణువు, విశ్వహిందూ పరిషత్‌ విజయవాడ నగర అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌, అర్చకసమాఖ్య అధ్యక్షుడు ఆత్రేయబాబు, రాధామనోహర్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని