Published : 14 Aug 2022 03:24 IST

జిల్లా కేంద్రానికి దారి ఇది

కోనసీమ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ రెవెన్యూ డివిజన్‌ కొత్తపేట. ఈ పట్టణం మీదుగా జిల్లా కేంద్రం అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఈ మార్గంలో నిత్యం వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చిన్నపాటి వర్షం కురిసినా దారంతా జలమయంగా మారుతోంది. వాన తగ్గాక ఆ బురదలోంచి వెళ్లలేక వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ మార్గంలో వెళ్లే ఆటోలు రెండు రోజులకే మరమ్మతులకు వస్తున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై ప్రమాణించడం అంటే నడుములు విరగ్గొట్టు కోవడమేనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కోనసీమ

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని