యాజమాన్య హక్కు నిర్ధారణ గడువు తగ్గింపు

రీ-సర్వే అనంతరం భూముల యాజమాన్య హక్కు నిర్ధారణకు ప్రస్తుతం ఉన్న 77 రోజుల గడువును 52కు కుదించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్‌ సిద్ధమైంది. భూముల

Published : 14 Aug 2022 05:28 IST

నిబంధనల మార్పుతో తుది నోటిఫికేషన్‌ సిద్ధం

ఈనాడు, అమరావతి: రీ-సర్వే అనంతరం భూముల యాజమాన్య హక్కు నిర్ధారణకు ప్రస్తుతం ఉన్న 77 రోజుల గడువును 52కు కుదించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్‌ సిద్ధమైంది. భూముల రీ-సర్వే నేపథ్యంలో హద్దుల నిర్ధారణ, ఇతర ప్రక్రియ కొనసాగుతున్నందున యాజమాన్య హక్కుల ఖరారు ముందు ఫాం-2 (క్లెయిమ్స్‌ స్వీకరణ), ఫాం-3 (డ్రాఫ్ట్‌ రికార్డ్‌), ఫాం-4 (పైనల్‌ రికార్డు) ద్వారా చర్యలు తీసుకునేందుకు, వివరాల నమోదుకు 77 రోజుల వరకు సమయం పడుతోంది. ఈ గడువులో 25 రోజులు తగ్గించారు. ఈ మేరకు ఏపీ పీ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదారు పాసుబుక్‌ రూల్స్‌లో మార్పులను ఖరారుచేస్తూ తుది నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనికి ఓ నమూనా దరఖాస్తును కూడా జతపరిచారు. హక్కుల నిర్ధారణ జరిగిన అనంతరం ఆన్‌లైన్‌లో వివరాల నమోదుకు బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వినియోగించనున్నారు. ఈ మేరకు ఇటీవల కేంద్ర సంస్థతో ఒప్పందం జరిగింది.

ఫసలీ ముగిసిన అనంతరం!
ఫసలీ (ప్రతి ఏడాది జులై 1 నుంచి జూన్‌ 30వ తేదీ వరకు) ముగిసిన అనంతరం జరిగిన మార్పులు/చేర్పులకు అనుగుణంగా సంబంధిత మండల తహసీల్దార్లు ఫాం-1బి అనుసరించి గ్రామాల్లో జాబితాలు ప్రకటించాలి. అభ్యంతరాలు వస్తే వాటిని పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకోవాలి. గతంలో అమల్లో ఉన్న జమాబందీ ద్వారా ఫసలీ గడువు ముగిసిన అనంతరం వివరాలు ప్రకటించే వారు. ప్రస్తుతం ఆ విధానం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని