Flag Hoisting: కరుణానిధి చొరవతో సీఎంల జెండావందనం!

పంద్రాగస్టునాడు కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం మనం చూస్తున్న ఆనవాయితీ! అంటే ప్రజలతో ఎన్నికైన ప్రతినిధి జెండా ఎగురవేయటం ఇందులోని ప్రాధాన్యం! కానీ

Updated : 15 Aug 2022 09:57 IST

పంద్రాగస్టునాడు కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం మనం చూస్తున్న ఆనవాయితీ! అంటే ప్రజలతో ఎన్నికైన ప్రతినిధి జెండా ఎగురవేయటం ఇందులోని ప్రాధాన్యం! కానీ స్వాతంత్య్రం వచ్చాక 1973 దాకా దిల్లీలో ఎర్రకోట నుంచి ప్రధాని, రాష్ట్రాల్లో గవర్నర్లు త్రివర్ణ పతాకం ఎగరేసేవారు. 1969లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సహకార సమాఖ్యలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాల కోసం డిమాండ్‌ చేసిన ఆయన ఈ విషయంపై కూడా వాదించారు. ఈ వివక్ష తగదంటూ కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి పంద్రాగస్టు నాడు పతాకావిష్కరణ అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగీకరించటంతో... 1974 ఆగస్టు 15 నుంచి... ముఖ్యమంత్రులకు త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించటం మొదలైంది. అలా పంద్రాగస్టు నాడు ముఖ్యమంత్రులు, గణతంత్ర దినోత్సవం రోజు గవర్నర్లు జెండా ఎగురవేసే విధానం అమలులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని