Jhanda uncha rahe hamara : ఆ గీతాన్ని రాసినందుకు జైలు శిక్ష..

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఆ గీతానికి వన్నె తగ్గలేదు.. ఇప్పటికీ ఎప్పటికీ దేశభక్తికి ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది. అదే.. ‘ఝండా ఊంచా రహే హమారా.. విజయీ విశ్వ తిరంగా ప్యారా..’ గీతం. కోట్ల మంది భారతీయుల

Updated : 15 Aug 2022 09:52 IST

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా ఆ గీతానికి వన్నె తగ్గలేదు.. ఇప్పటికీ ఎప్పటికీ దేశభక్తికి ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది. అదే.. ‘ఝండా ఊంచా రహే హమారా.. విజయీ విశ్వ తిరంగా ప్యారా..’ గీతం. కోట్ల మంది భారతీయుల హృదయాలను ఉప్పొంగించిన ఆ గీతాన్ని రచించింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన శ్యామ్‌లాల్‌గుప్తా పర్షద్‌. 1924లో ఆయన ఈ గీతాన్ని జైలులోనే అక్షరబద్ధం చేశారు. అనంతర స్వాతంత్య్రోద్యమంలో ఈ గీతం ఒక భాగంగా మారింది. జలియన్‌ వాలాబాగ్‌ అమరవీరుల జ్ఞాపకార్థం శ్యామ్‌లాల్‌ 1924 మార్చి 3న కాన్పుర్‌లోని ఫూల్‌బాగ్‌ మైదానంలో జవహర్‌లాల్‌ నెహ్రూ సమక్షంలో తొలిసారి ఆలపించారు. వెంటనే నెహ్రూ.. శ్యామ్‌లాల్‌ను కౌగిలించుకుని ఈ గీతం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అభినందించారు. ఈ గీతాన్ని రాసినందుకు శ్యామ్‌లాల్‌కు బ్రిటిష్‌ ప్రభుత్వం జరిమానా విధించి, మరోసారి జైలుకు పంపింది. స్వాతంత్య్రం వచ్చాక ఎర్రకోట నుంచి ఈ జాతీయ గీతాలాపన జరిగింది. అప్పటి నుంచి దీనికి ఫ్లాగ్‌సాంగ్‌ పేరు స్థిరపడిపోయింది. 1952 ఆగస్టు 15న ఎర్రకోట వద్ద శ్యామ్‌లాల్‌ స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. ఆయన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో పద్మశ్రీతో సత్కరించింది. 1977లో ఆయన కన్నుమూశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని