కృష్ణమ్మ పరవళ్లు

నాగార్జునసాగర్‌ డ్యాం 26 క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. క్రస్ట్‌ గేట్ల వద్ద జాతీయ జెండా రంగులు

Updated : 15 Aug 2022 05:50 IST

శ్రీశైలం, సాగర్‌ నుంచి భారీగా వరదనీరు

తరలివచ్చిన పర్యాటకులు

విజయపురి సౌత్‌, సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ డ్యాం 26 క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. క్రస్ట్‌ గేట్ల వద్ద జాతీయ జెండా రంగులు ప్రతిబింబించేలా విద్యుత్తు కాంతులు ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో త్రివర్ణ శోభితమై కనువిందు చేస్తోంది. ఆదివారం సాగర్‌కు పర్యాటకుల రద్దీ బాగా పెరిగింది. దీంతో కొత్త వంతెనపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 3,78,483 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం పది రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 12 అడుగుల మేర పైకెత్తి 3,17,460 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ మరో 62,382 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయ నీటిమట్టం 884.40 అడుగులు, నీటినిల్వ 211.9572 టీఎంసీలుగా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని