ఘనంగా రాఘవేంద్రుని మహారథోత్సవం

మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తరారాధనోత్సవంలో భాగంగా మహా రథోత్సవాన్ని పీఠాధిపతి

Published : 15 Aug 2022 05:12 IST

మంత్రాలయం, న్యూస్‌టుడే: మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 351వ ఆరాధన సప్తరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉత్తరారాధనోత్సవంలో భాగంగా మహా రథోత్సవాన్ని పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రహ్లాదరాయలను శ్రీరామచంద్రమూర్తి రూపంలో అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నడుమ స్వామి ఊరేగింపు నిర్వహించారు. యువత భక్తినృత్యాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సంప్రదాయ వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.  ఉత్సవమూర్తి, స్వామి బృందావనానికి పీఠాధిపతి రంగులు చల్లి వసంతోత్సవం నిర్వహించారు. హెలికాప్టర్‌ ద్వారా మహా రథంపై పూలవర్షం కురిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని