చిత్తూరు కలెక్టర్‌ సహా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు

చిత్తూరుజిల్లా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు మండలంలో పేదలకు ఇంటిస్థలాల కోసం 2004లో

Published : 15 Aug 2022 05:12 IST

చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే: చిత్తూరుజిల్లా రెవెన్యూ అధికారులకు లోకాయుక్త నోటీసులు జారీచేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు మండలంలో పేదలకు ఇంటిస్థలాల కోసం 2004లో రెవెన్యూ అధికారులు చెర్లోపల్లెలోని రమణారెడ్డి అనే వ్యక్తి నుంచి 82 సెంట్ల భూమిని సేకరించారు. అప్పటి నుంచి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈ భూమిని పరిశీలించినప్పటికీ, ఇళ్లస్థలాల కింద కేటాయించలేదు. చిత్తూరు-తిరుపతి హైవేకు ఆనుకుని ఉన్న విలువైన భూమిలో క్వారీ లీజుకు అనుమతించాలని ఓ ప్రజాప్రతినిధి దరఖాస్తు చేయగా, ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇంటి పట్టాల కోసం తీసుకున్న స్థలాన్ని క్వారీకి కేటాయించడంపై రమణారెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని తిరిగి ఇచ్చేస్తానని, ఆ 82 సెంట్ల భూమిని తిరిగి అప్పగించాలని కోరుతూ లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త దీనిపై వివరణ ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్లకు నోటీసులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని