16 నుంచి ఉపాధ్యాయులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ హాజరు

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి కలిపి  పాఠశాల విద్యాశాఖ ఒకే హాజరు యాప్‌ను రూపొందించింది. పాఠశాల ప్రాంగణంలో మాత్రమే పని చేసే ఈ

Published : 15 Aug 2022 05:12 IST

నెట్‌వర్క్‌ సమస్యలున్న చోట్ల ఏం చేయాలంటున్న టీచర్లు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బందికి కలిపి  పాఠశాల విద్యాశాఖ ఒకే హాజరు యాప్‌ను రూపొందించింది. పాఠశాల ప్రాంగణంలో మాత్రమే పని చేసే ఈ యాప్‌ను ఈ నెల 16 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉపాధ్యాయులు తమ సెల్‌ఫోన్‌లో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఉదయం 9 గంటల్లోపు ముఖ ఆధారిత (ఫేషియల్‌ రికగ్నిషన్‌తో) హాజరు వేయాలి. ఆ తర్వాత వేస్తే సెలవుగా పరిగణిస్తుంది. సెలవులు కూడా ఈ యాప్‌లోనే నమోదు చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ సరిగా పనిచేయక హాజరు పడకపోతే సెలవుగా పరిగణిస్తే ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. యాప్‌ వినియోగానికి ప్రత్యేకంగా పరికరం ఇవ్వకుండా ఉపాధ్యాయుల సొంత సెల్‌ఫోన్‌, నెట్‌ వినియోగించాలని చెప్పడం ఏమిటని పేర్కొంటున్నారు. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంటే తమ ఫోన్‌లోని డేటా ఇతరులకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులకు గతంలోలాగే టిక్‌ మార్క్‌ హాజరును ఉదయం 10 గంటల్లోపు నమోదు చేయాలి. అన్ని పథకాలకు ఈ హాజరునే ప్రామాణికంగా తీసుకుంటారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని