CM Jagan: స్వేద్వం.. అభ్యుద్వయం.. ఉటకించారు.. వజ్జోత్సవాలు
స్వేద్యం, ఆర్థిక స్వాలంబన, అభ్యుద్వయం, ఉటకించారు, సామాజిక అభ్రదత, మహానుయోధులు, వజ్జోత్సవాలు ఈ పదాలను చదువుతుంటే... ఏంటీ? అన్నీ తప్పులతడకగా ఉన్నాయే! అని అనిపిస్తోందా? స్వాతంత్య్ర దినోత్సవాన్ని
జగన్ ప్రసంగంలో అడుగడుగునా తడబాటు
ఈనాడు, అమరావతి: స్వేద్యం, ఆర్థిక స్వాలంబన, అభ్యుద్వయం, ఉటకించారు, సామాజిక అభ్రదత, మహానుయోధులు, వజ్జోత్సవాలు ఈ పదాలను చదువుతుంటే... ఏంటీ? అన్నీ తప్పులతడకగా ఉన్నాయే! అని అనిపిస్తోందా? స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం జగన్ ప్రసంగంలో దొర్లిన పొరపాట్లలో ఇవి కొన్ని మాత్రమే. దాదాపు 45 నిమిషాలపాటు ప్రసంగించిన ఆయన పలుమార్లు తడబాటుకు గురయ్యారు. కొన్ని పదాలు సరిగ్గా పలకలేకపోయారు. ఇరవైకి పైగా పదాలు పలకడంలో తప్పులు దొర్లాయి. మరికొన్ని పదాలు చదవడంలో తడబడి.... ఆ తర్వాత సరిదిద్దుకున్నారు.
* ‘మహాయోధుల త్యాగాల’తో అనటానికి బదులు ‘మహానుయోధుల త్యాగాలతో’ అని అన్నారు. ‘స్వాతంత్య్ర వజ్రోత్సవాలు’కు బదులు ‘స్వాతంత్య్ర వజ్జోత్సవాలు’ అని చదివారు. ‘ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం’ బదులు ‘ఆర్థిక స్వాలంబనకు చేయూత ఇస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.
* ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు’ అని అనాల్సిన చోట ‘సుస్థిరాభివృద్ధి లక్షణాలు’ అని అన్నారు. ఇవి మాత్రమే కాదు.. ‘ఉటంకించారు’ అనే పదాన్ని ‘ఉటకించారు’ అని, ‘స్వేదం’ అనే పదాన్ని ‘స్వేద్వం’ అని.. ‘విప్లవాత్మక’ అనే పదాన్ని ‘విప్లవాత్మిక’ అని పలికారు.
* అభ్యుదయాన్ని ‘అభ్యుద్వయం’గా చదివారు. నియామకం అని అనాల్సిన చోట తొలుత ‘నియాకం’ అని పేర్కొని మళ్లీ సరిదిద్దుకుని ‘నియామకం’ అని చదివారు. ‘సామాజిక అభద్రత’ అనడానికి బదులుగా ‘సామాజిక అభ్ర’ అని చదివి.. తర్వాత సరిదిద్దుకున్నారు.
* ‘ప్రతి పథకం’ అనేదాన్ని ‘ప్రతి ప్రతకం’ అని చదివారు. ‘ధర్మాల సమ్మేళనం’ అని అనాల్సిన చోట ‘ధర్మేలా సమ్మేళన’ అని పలికారు.
* ‘ఆర్థికంగా’ అని అనాల్సిన చోట ‘హార్థికంగా’ అని అన్నారు. ‘గోధుమ’ను ‘గోదము’ అని అన్నారు. ‘చదవక తప్పని పరిస్థితి’ అని అనాల్సిన చోట తడబడి ‘చదవ’ అని ఆపి మళ్లీ సరిదిద్దుకుని ‘చదవక తప్పని పరిస్థితి’ అని అన్నారు.
* ‘ఆవిర్భవించాలి’ అనే పదాన్ని ‘ఆవిర్భించాలి’ అని చదివారు. ‘కార్పొరేట్ విద్యాసంస్థలు’ అనే పదాన్ని ‘కార్పొరేట్ విద్య సంస్థలు’గా పలికారు. ఇలా జగన్మోహన్రెడ్డి ప్రసంగం ఆద్యంతం తడబాట్లుతోనే కొనసాగింది.
అంతా ‘జగనన్న’ నామస్మరణ
స్వాతంత్య్ర దినోత్సవాల్లో అంతా ‘జగనన్న’ నామస్మరణే జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి శకటాల ప్రదర్శన సందర్భంలో జరిగిన నేపథ్య వ్యాఖ్యానమంతా పదేపదే ‘జగనన్న ప్రభుత్వం’ అనే పదంతోనే కొనసాగింది.
* ‘మనుషులకే కాదు... పశువుల ఆరోగ్యానికి సైతం భద్రత, భరోసా కల్పిస్తోంది. మంచి మనసున్న మన జగనన్న ప్రభుత్వం’ అంటూ పశు సంవర్ధక శాఖ శకటం వచ్చిన సందర్భంగా వ్యాఖ్యానించారు.
* ‘అమ్మఒడి నుంచి ప్రభుత్వ బడి దాకా... వినూత్న విద్యా పథకాలు.. బడిపిల్లలకు వరాలు... జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పలు వినూత్న పథకాలు... బడి ఈడు పిల్లలకు వరాలుగా మారాయి’ అని విద్యాశాఖ శకటం వచ్చిన సందర్భంగా ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్‌ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్‌ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్‌కుమార్‌లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్‌ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్‌కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్‌దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం