నేడు 8 పరిశ్రమల నిర్మాణానికి సీఎం భూమిపూజ

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించడంతో పాటు మరో ఎనిమిది పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ

Published : 16 Aug 2022 03:58 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏటీసీ టైర్ల పరిశ్రమను ప్రారంభించడంతో పాటు మరో ఎనిమిది పరిశ్రమల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఈ సెజ్‌లో ఇప్పటికే పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ యూనిట్‌ ఉండగా దీనికి అనుబంధంగా మరో యూనిట్‌ నిర్మించనున్నారు. దీంతో పాటు మేఘా ఫ్రూట్‌ ప్రాసెసింగ్‌, ఐనాక్స్‌ ఎయిర్‌ ప్రొడక్ట్స్‌, ఆప్టిమస్‌ డ్రగ్‌ లిమిటెడ్‌, విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌, సైనాప్టిక్స్‌ ల్యాబ్‌్్స, స్టైరాక్స్‌ లైఫ్‌సైన్సెస్‌, ఇషా రిసోర్సెస్‌ కంపెనీలకు సీఎం భూమిపూజ చేయనున్నారు. 249 ఎకరాల్లో రూ.3,202 కోట్ల పెట్టుబడులతో నెలకొల్పనున్న ఈ పరిశ్రమలతో 4,664 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో విన్‌ విన్‌ స్పెషాలిటీ ఇన్సులేటర్స్‌ పరిశ్రమ గతంలో డబ్ల్యూఎస్‌ పేరుతో కొనసాగింది. దీనినే కొత్త పరిశ్రమగా సీఎం జగన్‌ ప్రారంభించనుండటం విశేషం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని