Andhra News: జగన్‌కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి

ముఖ్యమంత్రి జగన్‌కు ఓటేసినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకోవాలంటూ దివ్యాంగుడు చింతపట్ల వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పరిధిలోని

Updated : 16 Aug 2022 06:56 IST

పింఛను తొలగింపుపై దివ్యాంగుడి నిరసన

వెంకటగిరి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌కు ఓటేసినందుకు మా చెప్పుతో మమ్మల్ని కొట్టుకోవాలంటూ దివ్యాంగుడు చింతపట్ల వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు నరసింహులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పరిధిలోని వెలంపాళెంకు చెందిన వెంకటేశ్వర్లుకు రెండు కాళ్లు పనిచేయవు. చేతులు వంకర తిరిగాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పింఛను మంజూరైంది. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. తనలాంటి వందలాది మందికి పింఛను తొలగించి ఆవేదన మిగిల్చారని వెంకటేశ్వర్లు వాపోయారు. ఆయనకు పెళ్లి కాకపోవడంతో ప్రభుత్వ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేసే తమ్ముడు నరసింహులు వద్ద ఉంటున్నారు. తనవల్లే పింఛను తొలగించారంటూ అన్న నిష్టూరమాడుతున్నారంటూ నరసింహులు వాపోయారు. ఇద్దరి పేర్లు ఒకే రేషన్‌ కార్డులో ఉన్నాయని, తమ అన్నకు వేరుగా రేషన్‌కార్డు ఇప్పించి పింఛను అందేలా చూడాలని విన్నవించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని