సర్వదర్శనానికి 30 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. రెండు రోజులుగా రింగ్‌ రోడ్డు వరకు క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు సోమవారం సాయంత్రానికి పీఏసీ4 వరకు కనిపించారు. వీరికి దాదాపు 30 గంటల్లో శ్రీవారి

Published : 16 Aug 2022 03:58 IST

శ్రీవారిని దర్శించుకున్న 92,328 మంది భక్తులు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. రెండు రోజులుగా రింగ్‌ రోడ్డు వరకు క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు సోమవారం సాయంత్రానికి పీఏసీ4 వరకు కనిపించారు. వీరికి దాదాపు 30 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. ఆదివారంతో పోల్చుకుంటే కొంతవరకు భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం ఉదయం స్థానిక ఆస్థాన మండపం వరకు క్యూ ఉండగా... సాయంత్రానికి పీఏసీ4 వరకు ఉంది. సాయంత్రం నుంచి తిరుమలలో వర్షం కురుస్తోంది. ఆదివారం శ్రీవారిని 92,328 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.36 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 52,969 మంది తలనీలాలు సమర్పించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని