తెలంగాణ-ఏపీ సరిహద్దులో పులి కలకలం!

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు, చిలుకూరు గ్రామాల్లో సోమవారం పులి సంచరిస్తోందనే వార్త కలకలం సృష్టించింది. వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన కొంతమంది తాము

Published : 16 Aug 2022 03:58 IST

మధిర గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా మధిర మండలం ఖమ్మంపాడు, చిలుకూరు గ్రామాల్లో సోమవారం పులి సంచరిస్తోందనే వార్త కలకలం సృష్టించింది. వ్యవసాయ కూలి పనులకు వెళ్లిన కొంతమంది తాము పులిని చూశామని చెబుతున్నారు. రోడ్డు దాటి పొలాల్లోకి వచ్చిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలం అన్నవరం - దొడ్డదేవరపాడు గ్రామాల మధ్య రోడ్డుపై పులిని చూసినట్లు కూలీలు తెలిపారు. రోడ్డు దాటి తెలంగాణలోని ఖమ్మం జిల్లా మదిర మండలం ఖమ్మంపాడు - తొండలగోపవరం వైపు వచ్చినట్లుగా వివరించారు. అటవీశాఖ అధికారులు పులిని చూసినట్లు చెబుతున్న ప్రాంతాలన్నీ పరిశీలించారు. పెద్దపులి గుర్తులు కనిపించలేదని.. హైనా అయి ఉంటుందని అటవీశాఖ రేంజర్‌ విజయలక్ష్మీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు