‘పతాక’ స్థాయి రికార్డు!

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం కోలారులోని విశ్వేశ్వరయ్య మైదానంలో సోమవారం భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. దీనిని 13 వేల మీటర్ల వస్త్రంతో, 204 అడుగుల పొడవు, 630 అడుగుల వెడల్పుతో

Published : 16 Aug 2022 03:58 IST

న్యూస్‌టుడే, కోలారు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రం కోలారులోని విశ్వేశ్వరయ్య మైదానంలో సోమవారం భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. దీనిని 13 వేల మీటర్ల వస్త్రంతో, 204 అడుగుల పొడవు, 630 అడుగుల వెడల్పుతో తయారుచేశారు. పతాకంపై సైనిక హెలికాప్టర్‌తో పూలవర్షాన్ని కురిపించారు. దీనిని 2,500 మందికి పైగా యువకులు, స్థానికులు పట్టుకుని మైదానంలోకి తీసుకురాగా.. ఎంపీ మునిస్వామి ఆవిష్కరించారు. భారీ జాతీయ పతాకాన్ని తయారు చేయడాన్ని రికార్డుగా పరిగణనలోకి తీసుకున్నామని లిమ్కా రికార్డుల పుస్తకం ప్రతినిధులు తెలిపారు.                

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని