63 మంది ఖైదీల విడుదల

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన గల 63 మంది ఖైదీలను సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి జైలు అధికారులు విడుదల చేశారు. వీరిలో జీవితఖైదు

Published : 16 Aug 2022 03:58 IST

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన గల 63 మంది ఖైదీలను సోమవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి జైలు అధికారులు విడుదల చేశారు. వీరిలో జీవితఖైదు అనుభవిస్తున్న 48 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు.


అపరాధ రుసుము చెల్లించలేక..

విశాలాక్షినగర్‌ (విశాఖ), న్యూస్‌టుడే: విశాఖ కేంద్ర కారాగారం నుంచి 40 మంది పురుషులు, ఇద్దరు మహిళల విడుదలకు అనుమతి లభించింది. వీరిలో హత్య కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఓ మహిళ రూ.60 వేల జరిమానా చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం కట్టకపోతే మరో ఆరు నెలలు అదనంగా జైలుశిక్ష అనుభవించాలని అప్పట్లో కోర్టు తీర్పునిచ్చింది. సత్ప్రవర్తన కారణంగా ఆమె విడుదలకు తాజాగా అవకాశం వచ్చినా, జరిమానా చెల్లించనందున బయటకు రాలేకపోయింది. దీంతో సోమవారం 41 మందే విడుదలయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని