జన్మభూమి రుణం తీర్చుకోవాలి

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు జన్మభూమి రుణం తీర్చుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక దేశాల్లో తెలుగు వారు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని అభినందించారు. ఆజాదీకా అమృత్‌

Updated : 16 Aug 2022 06:25 IST

ఎన్నారైలకు తెదేపా అధినేత పిలుపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు జన్మభూమి రుణం తీర్చుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అనేక దేశాల్లో తెలుగు వారు ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని అభినందించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా 60కిపైగా దేశాల్లో ఉన్న తెలుగు వారితో సోమవారం ఆయన జూమ్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘ఎన్నారైలు సంపద సృష్టికర్తలుగా మారాలి. నాడు ప్రభుత్వ విధానాల ద్వారా లబ్ధి పొంది విదేశాల్లో మంచి స్థాయిలో ఉన్న వారు మాతృభూమిని మర్చిపోకూడదు. దేశంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. సొంత గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. గతంలో తెదేపా పిలుపుతో చాలామంది ఎన్నారైలు స్పందించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం అందించారు. పార్టీకి, ఎన్నారైలకు వారధిగా ఉండేందుకు తెదేపా ఎన్నారై విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ విభాగం ద్వారా విదేశాల్లోని తెలుగు వారికి కావలసిన సాయం అందిస్తున్నాం. భవిషత్తులో ఏపీ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి విదేశాలకు పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఏపీ నష్టపోతున్న తీరుపై చంద్రబాబుతో పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడారు. కోమటి జయరాం, రాజశేఖర్‌, వేమూరి రవికుమార్‌, బుచ్చిరాంప్రసాద్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని