Published : 16 Aug 2022 06:37 IST

కుప్పంలో చెలరేగుతున్న అక్రమార్కులు

అడ్డుకట్టకు చర్యలు తీసుకోండి
డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గంలో అడ్డూఅదుపు లేకుండా జరుగుతున్న అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సోమవారం లేఖ రాశారు. ‘గతంలో కుప్పం మండలం చెక్కున్తతం, పైపాళ్యం ప్రాంతంలో వైకాపా నాయకులు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. దీన్ని అడ్డుకున్నారని ఆగ్రహించిన అధికార పార్టీ అక్రమార్కులు ఆదివారం తెదేపాకు చెందిన తంగవేలు, లోకేశ్‌, భూతి, సౌందరీపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుప్పంలో జరుగుతున్న ఇసుక, బియ్యం, గ్రానైట్‌ అక్రమ వ్యాపారాలపై పలుమార్లు నేనే పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. పోలీసులలోని ఒక వర్గం సంఘ విద్రోహశక్తులకు మద్దతు ఇవ్వడంతో శాంతిభద్రతలు దుర్భరంగా ఉన్నాయి. రాష్ట్రంలో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. పోలీసు అధిపతిగా డీజీపీ శాంతిభద్రతల వైఫల్యానికి బాధ్యత వహించాలి. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దాడికి సంబంధించి ఫొటోలు, వీడియోలను దానికి జత చేశారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts