‘సర్వే రాళ్ల’ టెండర్ల ధరల బిడ్ల పరిశీలన నేడు

రాష్ట్రంలో ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు సర్వే రాళ్ల సరఫరాకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) టెండర్లు పిలిచింది. వాటి బిడ్లను మంగళవారం తెరవనున్నారు. ప్యాకేజీ-1

Published : 16 Aug 2022 06:37 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు సర్వే రాళ్ల సరఫరాకు సంబంధించి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) టెండర్లు పిలిచింది. వాటి బిడ్లను మంగళవారం తెరవనున్నారు. ప్యాకేజీ-1 కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలకు కలిపి 2.06 లక్షల సర్వే రాళ్లు, ప్యాకేజీ-2 కింద చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు కలిపి 76,456 సర్వే రాళ్ల సరఫరాకు జులైలో టెండర్లు పిలిచారు. వీటి సాంకేతిక బిడ్ల పరిశీలన ఇటీవల జరగ్గా, మంగళవారం ధరల బిడ్లు తెరవనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని