పింగళి వెంకయ్య మనకు గర్వకారణం

ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించడంలో కీలకపాత్ర పోషించిన జాతీయ పతాకాన్ని తెలుగు వారైన పింగళి వెంకయ్య రూపొందించడం తెలుగు వారందరికీ గర్వకారణమని శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు అన్నారు.

Published : 16 Aug 2022 06:37 IST

మండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించడంలో కీలకపాత్ర పోషించిన జాతీయ పతాకాన్ని తెలుగు వారైన పింగళి వెంకయ్య రూపొందించడం తెలుగు వారందరికీ గర్వకారణమని శాసనమండలి ఛైర్మన్‌ మోషేన్‌రాజు అన్నారు. మండలిలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు జగన్‌ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.  


ఫలాలు అందరికీ అందాలి: స్పీకర్‌ తమ్మినేని

కుల, మత, జాతి, ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్ర ఫలాలు అందాలని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆకాంక్షించారు. ఈ దిశగా సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. శాసనసభ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, డిప్యూటీ సెక్రటరీ కె.రాజ్‌కుమార్‌, చీఫ్‌ మార్షల్‌ థియోఫిలస్‌ పాల్గొన్నారు.


అర్హులందరికీ సంక్షేమ పథకాలు: సీఎస్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ అందేలా ఉద్యోగులు కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ఎస్పీఎఫ్‌ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్‌గౌర్‌, సచివాలయ సీఎస్‌వో కె.కృష్ణమూర్తి, డిప్యూటీ సెక్రటరీ రామసుబ్బయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని