వాయిదా పద్ధతిలో విద్యుత్తు బకాయిల చెల్లింపు

విద్యుత్తు ఉత్పత్తిదారులకు డిస్కంలు చెల్లించాల్సిన రూ.17,060 కోట్ల బకాయిలను రానున్న 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించనున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు.

Updated : 16 Aug 2022 06:45 IST

ఇంధన శాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌

గుణదల, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉత్పత్తిదారులకు డిస్కంలు చెల్లించాల్సిన రూ.17,060 కోట్ల బకాయిలను రానున్న 12 నెలల్లో వాయిదాల పద్ధతిలో చెల్లించనున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. విజయవాడ గుణదలలోని జెన్‌కో కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేట్‌ పేమెంట్‌ సర్‌ ఛార్జీ పథకంలోకి ఆంధ్రప్రదేశ్‌ డిస్కంలు చేరినట్లు చెప్పారు. ఈ నెల 6న మొదటి నెల వాయిదా కింద రూ.1422 కోట్ల మేర చెల్లించినట్లు చెప్పారు. 7 వేల మెగావాట్ల విద్యుత్తు కొనుగోలుకు సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. వేడుకల్లో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌, జేఎండీలు బి.మల్లారెడ్డి, ఐ.పృథ్వీతేజ్‌, డైరెక్టర్లు భాస్కర్‌, మురళి, చంద్రశేఖరరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని