కుళాయిల నుంచి పురుగు మందు కలిపిన నీరు

పంటలకు వాడే పురుగు నివారణ మందు కలిపిన నీరు కుళాయిల నుంచి రావడంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లె గ్రామ  కాలనీలో మంగళవారం ఉదయం

Published : 17 Aug 2022 03:49 IST

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: పంటలకు వాడే పురుగు నివారణ మందు కలిపిన నీరు కుళాయిల నుంచి రావడంతో కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం కొండుపల్లె గ్రామ  కాలనీలో మంగళవారం ఉదయం కుళాయిల నుంచి పురుగుల మందు కలిసిన నీరు సరఫరా అయ్యింది. శివమ్మ అనే వృద్ధురాలు నీటి వాసనను గుర్తించి మిగతా వారిని అప్రమత్తం చేశారు. రెడ్డిచర్ల రాజు, సిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తోట రాముడు, తోట మధు, ఉప్పరి లక్ష్మీదేవి, హైదర్‌ వలీ ఇళ్ల కుళాయిల్లో మాత్రమే ఈ నీరు రావడంతో అనుమానాలకు దారి తీసింది.  వారిళ్లలోకి వచ్చిన నీటిని పరిశీలించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఈవోపీఆర్డీ వెంకటేశ్వరరావు, పోలీసులు వచ్చి నీటిని పరిశీలించారు. ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకునేందుకు పైపులైన్లు పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని