కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 20 వరకు జరగనున్నాయి. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో

Published : 17 Aug 2022 03:49 IST

ఈనాడు, అమరావతి: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 20 వరకు జరగనున్నాయి. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు, దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ నెల 21న జరగనున్న చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం ఆహ్వాన పత్రికనూ ముఖ్యమంత్రికి అందజేశారు. ఆలయ వేదపండితులు స్వామివారి ప్రసాదాలు, అందజేసి, ఆశీర్వచనం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని