ఊరి సమస్యలు తీరిస్తే గానీ.. మరుభూమికి దారివ్వం

తమ గ్రామ సమస్యలు పరిష్కరించే వరకూ శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి ఇచ్చేది లేదంటూ ఓ గ్రామస్థులు పొరుగూరి నుంచి బయల్దేరిన శవయాత్రను అడ్డుకున్న వైనమిది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని కొత్త

Published : 17 Aug 2022 03:48 IST

అధికారుల హామీతో దిగొచ్చిన గ్రామస్థులు

కొమరాడ, న్యూస్‌టుడే: తమ గ్రామ సమస్యలు పరిష్కరించే వరకూ శ్మశానవాటికకు వెళ్లేందుకు దారి ఇచ్చేది లేదంటూ ఓ గ్రామస్థులు పొరుగూరి నుంచి బయల్దేరిన శవయాత్రను అడ్డుకున్న వైనమిది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని కొత్త కళ్లికోటకు చెందిన ఓ వృద్ధురాలు మంగళవారం చనిపోగా, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు పాతకళ్లికోట మీదుగా శ్మశానవాటికకు బయల్దేరారు. ఇక్కడ దహన సంస్కారాలు చేయాలంటే అధికారులు వచ్చి తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని పాతకళ్లికోట గ్రామస్థులు పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు రాధాకృష్ణ, ఎస్సై జగదీశ్‌నాయుడు, ఎంపీపీ శ్యామల గ్రామానికి చేరుకొని వారితో చర్చించారు. ‘తోటపల్లి జలాశయం ముంపు ప్రాంతమైన పాతకళ్లికోటలోని 30 కుటుంబాలకు పునరావాసం కింద స్థలాలు, ప్యాకేజీ ఇవ్వలేదు. వరదలొస్తే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. ఏనుగుల దాడుల్లో పంటలు ధ్వంసమవుతున్నా పరిహారం ఇవ్వలేదు’ అంటూ డిమాండ్లు వినిపించారు. నెల రోజుల్లో ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శవయాత్రను తమ ఊరి మీదుగా అనుమతించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని