Botsa: 2 ఫొటోల అప్‌లోడ్‌ కోసం బోధన ఆపేస్తారా?

‘రెండు ఫొటోల అప్‌లోడ్‌ కోసం తరగతి బోధన ఆపడం సరికాదు. దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పండి..’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

Updated : 17 Aug 2022 08:30 IST

చీపురుపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ‘రెండు ఫొటోల అప్‌లోడ్‌ కోసం తరగతి బోధన ఆపడం సరికాదు. దీనికి ఎంత సమయం పడుతుందో చెప్పండి..’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని కరకాంలో గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం అధికారులతో సభ నిర్వహించారు. ఈ సమయంలో పిల్లలకు ఉపాధ్యాయులు సరిగా చదువు చెప్పడం లేదని, అందుకే కొందరు టీసీలు తీసుకొని ఇతర బడులకు వెళ్లిపోయారని గ్రామస్థులు మంత్రి దృష్టికి  తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన ఎందుకు చెప్పడం లేదని అడిగారు. ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని, ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ అందడం లేదని.. ఇలా ఉపాధ్యాయులు రకరకాల కారణాలు చెబుతున్నారని స్థానికులు బదులిచ్చారు. దీంతో మండల ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారి ఎస్‌.భానుప్రకాశ్‌ను  వివరణ కోరి, పాఠాలు చెప్పని ఉపాధ్యాయులకు మెమో ఇవ్వాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని