Updated : 17 Aug 2022 05:40 IST

సత్యాన్వేషణే హిందుత్వం

ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాంమాధవ్‌

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: సత్యాన్ని నిరంతరం అన్వేషించడమే హిందుత్వమని ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రచయిత రాంమాధవ్‌ అన్నారు. ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందుత్వం ఉందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హిందుత్వంపై పరిపూర్ణ అవగాహన కల్పించేలా తాను ‘ది హిందుత్వ పారడైమ్‌’ పుస్తకాన్ని రచించినట్లు ఆయన వివరించారు. ఆ పుస్తక పరిచయం, త్వరలో ఆవిష్కరించనున్న మరో రచన ‘పార్టిషన్డ్‌ ఫ్రీడమ్‌’ పుస్తక కవర్‌ పేజీ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో మంగళవారం నిర్వహించారు. సాహితీ సుధ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాంమాధవ్‌ మాట్లాడారు. ‘పార్టిషన్డ్‌ ఫ్రీడమ్‌’ పుస్తకంలో తాను దేశవిభజన గురించి రాసినట్లు తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలో సమూల మార్పులను గాంధీజీ ఆకాంక్షించారని, గ్రామసీమల్లో పేదరికం సమూల అంతం, విద్యాభివృద్ధిని చూడాలనుకున్నారన్నారు. ఇలాంటి పరిస్థితులు రావాలంటే.. తొలుత కాంగ్రెస్‌ను రద్దుచేయాలని గాంధీజీ ఆనాడే చెప్పారని, అప్పుడా పని చేయని కాంగ్రెస్‌.. ఇప్పుడు దేశంలో తమపార్టీని పూర్తిగా రద్దుచేసే దిశగా అడుగులు వేస్తోందంటూ చలోక్తి విసిరారు. ప్రజాస్వామ్య దేశంగా ఉండటమంటే సామాన్య వ్యక్తి అభిప్రాయానికీ విలువ ఇవ్వాలని.. అంతేకానీ అధికారం ఉంది కదా అని విశాఖపట్నంలో ఒక రాజధాని, కర్నూలులో మరో రాజధాని ఇలా ఇష్టారీతిన పెట్టుకోవడం కాదన్నారు. ముఖ్య అతిథి, రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి దేశప్రజల్లో ఉన్న తప్పు భావనను తొలగించి, పరిపూర్ణంగా ప్రజలకు తెలియజేసేందుకు తాను త్వరలోనే ఓ సినిమా, వెబ్‌ సిరీస్‌ తీస్తున్నట్లు తెలిపారు. పార్టిషన్డ్‌ ఫ్రీడమ్‌ పుస్తకం కవర్‌ పేజీని విజయేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు. ప్రముఖ నవలా రచయిత దుగ్గరాజు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. తొలి పలుకులను, ది హిందుత్వ పారడైమ్‌ పుస్తక విశేషాలను నెడ్‌ఫీ (గువాహటి) ఛైర్మన్‌ పీవీఎస్‌ఎల్‌ఎన్‌ మూర్తి వివరించారు. కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు హాజరయ్యారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని