సివిల్‌ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్‌ చట్టం రద్దు

ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్‌ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆర్డినెన్సు జారీ చేశారు. ఈ నెల 13న గవర్నర్‌ జారీచేసిన ఆర్డినెన్సును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్‌లో

Published : 17 Aug 2022 05:22 IST

ఆర్డినెన్సు జారీ చేసిన గవర్నర్‌

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్‌ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆర్డినెన్సు జారీ చేశారు. ఈ నెల 13న గవర్నర్‌ జారీచేసిన ఆర్డినెన్సును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గెజిట్‌లో ప్రచురించింది. ప్రస్తుతం ట్రైబ్యునల్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌కు బదిలీచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం గడువులోగా వాటిని పరిష్కరించాలని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత సివిల్‌ సర్వీసుల క్రమశిక్షణ వ్యవహారాల ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. 2020 ఫిబ్రవరి 1 నుంచి ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌, సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2009 నుంచి ఇప్పటిదాకా ట్రైబ్యునల్‌లో 719 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అభియోగాలు నమోదు చేసి ట్రైబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల్ని వేరే సంస్థకు బదిలీ చేసేందుకు చట్టప్రకారం అవకాశం లేనందున మొత్తం చట్టాన్నే రద్దు చేస్తూ ఆర్డినెన్సు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని