జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ‘ఈనాడు’కు 8 అవార్డులు

స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ జాతీయ స్థాయిలో ఛాయాచిత్ర పోటీలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సౌజన్యంతో ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ-జాషువా

Updated : 18 Aug 2022 06:27 IST

విజయవాడ, (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే: స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ జాతీయ స్థాయిలో ఛాయాచిత్ర పోటీలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి సౌజన్యంతో ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ-జాషువా సాంస్కృతిక వేదిక సహకారంతో ఈ పోటీలు జరిగాయి. 75 వసంతాల వేడుకల్లో దేశవ్యాప్తంగా ఆగస్టు మొదటి రెండు వారాల్లో జరిగిన సంబరాలపై అకాడమీ ఎంట్రీలను ఆహ్వానించగా దేశం నలుమూలల నుంచి 463 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఒక్కొక్కరు రెండేసి ఛాయాచిత్రాల చొప్పున పంపించారు. అకాడమీ వాటిలో ఉత్తమంగా నిలిచిన 75 ఛాయాచిత్రాలను ఎంపిక చేసింది. ‘ప్లాటినం జూబ్లీ ఇమేజ్‌ అవార్డు’ పేరుతో 75 అవార్డులు ప్రకటించింది. ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్లు 8 మందికి అవార్డులు లభించాయి. ఎం.పి.ఎస్‌.కె.దుర్గాప్రసాద్‌ (విజయవాడ), బి.మరిడయ్య (విజయవాడ), జె.ఎ.నాయుడు (విశాఖపట్నం), ఎన్‌.హరిగంగాధర్‌ (తిరుపతి), సి.బషీర్‌ (హైదరాబాద్‌), సింహాచలం (ఆదిలాబాద్‌), కె.సైదేశ్‌ (కర్నూలు), డి.కృష్ణకాంత్‌ (నరసరావుపేట న్యూస్‌టుడే ఫొటో కంట్రిబ్యూటర్‌)లను అవార్డులు వరించాయి. వీరికి గురువారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో బహుమతులు అందిస్తారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, సోషల్‌ ఆంత్రోపాలజిస్ట్‌ డాక్టర్‌ ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి, సోషల్‌ హిస్టోరియన్‌ డాక్టర్‌ కొంపల్లి హెచ్‌.హెచ్‌.ఎస్‌.సుందర్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారని అకాడమీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రవీంద్రనాథ్‌, టి.శ్రీనివాసరెడ్డిలు తెలిపారు.


తిరంగా.. తారంగం

స్వాతంత్య్ర అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఫొటోగ్రఫీ అకాడమీ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఛాయాచిత్ర పోటీల్లో.. ‘ఈనాడు’ ఫొటోగ్రాఫర్ల తీసిన అవార్డులు పొందిన చిత్రాలు ఇవి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు