మాంసాభివృద్ధి సంస్థ ఎండీపై హైకోర్టు ఆగ్రహం

కోర్టు విచారణకు గైర్హాజరైన ఏపీ మాంసాభివృద్ధి సంస్థ ఎండీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై బెయిలబుల్‌ వారెంట్‌(బీడబ్ల్యూ) జారీ చేసింది. రూ.10లక్షల పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది. వారెంట్‌ను అమలు

Published : 18 Aug 2022 05:21 IST

బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

ఈనాడు, అమరావతి: కోర్టు విచారణకు గైర్హాజరైన ఏపీ మాంసాభివృద్ధి సంస్థ ఎండీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై బెయిలబుల్‌ వారెంట్‌(బీడబ్ల్యూ) జారీ చేసింది. రూ.10లక్షల పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది. వారెంట్‌ను అమలు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించింది. సెప్టెంబరు 15న జరిగే విచారణకు ఎండీ హాజరుకావాలని తేల్చిచెప్పింది. విఫలమైతే తదుపరి విచారణలో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌(ఎన్బీడబ్ల్యూ) జారీ చేస్తామని హెచ్చరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనాల వ్యవహారంలో దాఖలైన అప్పీల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎం.పిచ్చయ్య, ఎండీ తరఫున న్యాయవాది వీవీఎన్‌ నారాయణరావు వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని