Published : 18 Aug 2022 04:23 IST

పరిహారం చెల్లించాలని ఆదేశించే అధికారం ఎక్కడిది?

హెచ్‌ఆర్‌సీని ప్రశ్నించిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: ఓ వ్యక్తికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ జలవనరులశాఖ అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్‌ఆర్‌సీ) జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. పరిహారం చెల్లించాలని ఆదేశించే అధికారం హెచ్‌ఆర్‌సీకి ఎక్కడిదని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. ఎంజేఎస్‌ రాజు అనే వ్యక్తి నుంచి భూమిని సేకరించి పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం చేయడంతోపాటు, ఏళ్లతరబడి పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగేలా చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. ఇందుకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని మే 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి, మైనర్‌ ఇరిగేషన్‌ సర్కిల్‌ కర్నూలు సూపరింటెండెంట్‌, నంద్యాల మైనర్‌ ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వ్యాజ్యం వేశారు. వారి తరఫున ప్రభుత్వ న్యాయవాది శివకుమారి వాదనలు వినిపించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts