సినిమా షూటింగ్‌లో జారిపడిన నాజర్‌

ప్రముఖ నటుడు నాజర్‌ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జారిపడటంతో స్వల్ప గాయమైంది. హైదరాబాద్‌ శివారులోని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా బుధవారం నాజర్‌పై చిత్రీకరణ జరుగుతుండగా

Updated : 18 Aug 2022 06:29 IST

కంటి కింద భాగంలో స్వల్ప గాయం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రముఖ నటుడు నాజర్‌ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జారిపడటంతో స్వల్ప గాయమైంది. హైదరాబాద్‌ శివారులోని తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా బుధవారం నాజర్‌పై చిత్రీకరణ జరుగుతుండగా, మెట్లు ఎక్కుతున్న ఆయన పట్టుతప్పి కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆయన ఎడమకంటి కింద భాగంలో చిన్న గాయమై రక్తం కారింది. సిబ్బంది వెంటనే కట్టుకట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆయన ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని