స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణరాజు కన్నుమూత

పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మంతెన వెంకట సూర్యనారాయణరాజు (93) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈనెల

Published : 18 Aug 2022 04:23 IST

ఉండి, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడుకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మంతెన వెంకట సూర్యనారాయణరాజు (93) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఈనెల 14న ఆయనకు ఊపిరితిత్తుల సమస్య తలెత్తగా భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన కుమారుడు మంతెన రవివర్మ తెలిపారు. 1929లో జన్మించిన సూర్యనారాయణ రాజు 1941లో భీమవరంలో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొని, వారంరోజుల కారాగార శిక్ష అనుభవించారు. అప్పటికి ఆయన వయసు 12 ఏళ్లే కావడంతో బ్రిటిషు అధికారులు విడిచిపెట్టారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో నాయకులకు సమాచారాన్ని చేరవేస్తూ సహకరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శిగా 20 ఏళ్లు పనిచేశారు. ఉద్యోగవిరమణ పొందాక భీమవరంలో రైతు కార్యాచరణ సమితిని స్థాపించారు. నీటితీరువా పెంపు, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర సాధన, విద్యుత్తుఛార్జీల పెంపునకు నిరసనగా ఉద్యమాల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని