మరో రూ. 1000 కోట్ల అప్పు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లెక్కకు మిక్కిలి అప్పులు తీసుకుంటోంది. గురువారం రిజర్వుబ్యాంకు నిర్వహించిన బహిరంగ మార్కెట్‌ వేలంలో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. మొత్తం 13 ఏళ్ల

Published : 19 Aug 2022 02:36 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం లెక్కకు మిక్కిలి అప్పులు తీసుకుంటోంది. గురువారం రిజర్వుబ్యాంకు నిర్వహించిన బహిరంగ మార్కెట్‌ వేలంలో రూ.1,000 కోట్ల రుణం తీసుకుంది. మొత్తం 13 ఏళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7.72శాతం వడ్డీకి రూ.500 కోట్లు, మరో 16 ఏళ్ల కాలపరిమితితో తీర్చేలా 7.74శాతం వడ్డీకి మరో రూ.500 కోట్లు రుణం సేకరించింది. దీంతో కలిపి ఇంతవరకు ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.34,980 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకున్నట్లయింది. ఆంధ్రప్రదేశ్‌కు తొలి తొమ్మిది నెలల్లో రూ.43,803 కోట్ల బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. అలాంటిది ఏకంగా 34 వేల కోట్లకు పైగా మొత్తం తొలి నాలుగున్నర నెలల్లోనే తీసుకోవడం విశేషం. ఇది కాకుండా నాబార్డు, ఇతర కార్పొరేషన్ల ద్వారా మరింత రుణం పొందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని