రామాలయ భూఆక్రమణదారుల రాస్తారోకో

భద్రాచలం రామాలయం భూమిని ఆక్రమించుకొని అక్కడే మకాం వేసిన ఆక్రమణదారులు గురువారం రాస్తారోకో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని ఆదర్శనగర్‌ కాలనీ వద్ద రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై వంటావార్పు చేస్తూ

Updated : 19 Aug 2022 06:44 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయం భూమిని ఆక్రమించుకొని అక్కడే మకాం వేసిన ఆక్రమణదారులు గురువారం రాస్తారోకో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని ఆదర్శనగర్‌ కాలనీ వద్ద రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై వంటావార్పు చేస్తూ ఆందోళన నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాచలం రాముడి దేవాలయ మాన్యం ఉంది. ఇక్కడ 15 ఎకరాలను ఆక్రమించుకున్న భద్రాచలం-ఎటపాక మండల వాసులు ఆ స్థలం తమకే కేటాయించాలని నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. బుధవారం రాత్రి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో చాలామంది స్థలాన్ని ఖాళీ చేశారు. ఇక పరిస్థితి సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో గురువారం ఉదయం మళ్లీ మొదటికొచ్చింది. ‘భూ నిర్వాసితుల ఐక్య వేదిక’ పేరిట కేసీఆర్‌, అంబేడ్కర్‌ బొమ్మలున్న ఫ్లెక్సీతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అనంతరం నడుచుకుంటూ భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని సిబ్బందికి వినతి పత్రం అందించారు. తమకు స్థలం కేటాయించి పక్కా ఇళ్లను నిర్మించాలని కోరారు. సుమారు గంట పాటు ఉభయ రాష్ట్రాల సరిహద్దు రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని