తప్పు చేసిన ఎంపీని సీఐడీ చీఫ్ వెనకేసుకు రావడం సిగ్గుచేటు
వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ వెనకేసుకు రావడం సిగ్గుచేటని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. మాధవ్ నగ్న వీడియోపై అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు
తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ వెనకేసుకు రావడం సిగ్గుచేటని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. మాధవ్ నగ్న వీడియోపై అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్స్టాఫర్డ్ ఇచ్చిన నివేదక అవాస్తవమంటూ సునీల్‌కుమార్ చెప్పడం తగదని దుయ్యబట్టారు. మాధవ్ వీడియో వాస్తవమని, దాన్ని ఎవరూ ఎడిట్ చేయలేదని జిమ్స్టాఫర్డ్ ఇచ్చిన నివేదిక పచ్చి నిజమని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆ వీడియో పంపింది, ఆ వీడియోను పరీక్షించడానికి ఎంత నగదు చెల్లించింది, ఇలా అన్ని వివరాలూ మా దగ్గర ఉన్నాయి. నిజం నిప్పు లాంటిది. ఇంత జరిగినా ఆ ఎంపీని అధికారులు వెనకేసుకు రావాలని చూస్తున్నారు. నిజాన్ని నిగ్గుతేల్చడానికి ప్రయత్నిస్తున్న మాపై కేసులు పెడతారట. ఇప్పటికైనా సునీల్‌కుమార్ బుకాయింపులు మాని మాధవ్ చేతిలో మోసపోయిన మహిళలకు న్యాయం చేయాలి. మాధవ్ వీడియోను జాతీయ ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపాలి. త్వరలో మరిన్ని వాస్తవాలతో ప్రజల ముందుకు వస్తాం. స్టాఫర్డ్ నివేదికను జనబాహుళ్యంలో ఉంచుతాం. మాకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు. వైకాపా ప్రభుత్వం వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు’ అని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు